BRS: ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి.. మాజీమంత్రి హరీష్ రావు డిమాండ్

by Ramesh Goud |   ( Updated:2024-10-22 09:52:30.0  )
BRS: ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి.. మాజీమంత్రి హరీష్ రావు డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యార్థినులు గాయాల పాలవడం దురదృష్టకరమని, ప్రభుత్వం మొద్దు నిద్ర పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురుకులాల్లో కరెంట్ షాక్ తగిలి విద్యార్ధినిలకు గాయాలైన ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా.. సిబ్బంది నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని, ప్రభుత్వ పట్టింపులేని తనం పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నదని ఆరోపించారు.

మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ గురుకులానికి చెందిన నలుగురు విద్యార్థినులు కరెంట్ షాక్ తగిలి గాయాల పాలవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, ఫుడ్ పాయిజన్ కేసులు సర్వసాధారణం అయ్యాయని.. ఇప్పుడు ఆ జాబితాలో కరెంట్ షాకులు కూడా చేరాయని వ్యాఖ్యానించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, గాడి తప్పిన గురుకులాలను బాగు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed