- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన తెలంగాణ ఎన్నికల దంగల్.. BRS ఆశలన్నీ ఆ ఓటర్లపైనే..!
దిశ, తెలంగాణ బ్యూరో: తటస్థ ఓటర్లపైనే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఓటుతోనే గట్టెక్కుతామని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నది. గెలుపు తమదేనంటూ నేతలు సైతం కేడర్‌కు భరోసా ఇస్తున్నారు. గతేడాది వచ్చిన పోల్ పర్సంటేజీ వస్తుందని ఆశిస్తున్నారు. పోలింగ్ సరళిపై గులాబీనేత పరిశీలించి కేడర్‌కు సైతం పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఏ ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీలకు తటస్థంగా ఉండే ఓటర్లే కీలకం. వారే గట్టెక్కించేది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తటస్థ ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ వారిపైనే ఆశలు పెట్టుకుంది. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని గ్రామాలకు తీసుకొచ్చి ఓటు వేయించడంతో పాటు గ్రామంలో ఉన్న తటస్థులను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
వారికి తాయిలాలు ఇచ్చి మరీ ఓటు వేయించినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో గట్టెక్కుతామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపార్టీ వైపు మొగ్గుచూపకుండా ప్రమాణం కూడా చేయించుకొని ఓటు వేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిపై వేసిన ప్రణాళిక సక్సెస్ అయిందని, దీంతో గట్టెక్కుతామనే విశ్వాసాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేడర్‌కు సైతం అదే భరోసా ఇస్తున్నారు.
పోలింగ్ సరళిపై కేసీఆర్ పరిశీలన
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గులాబీ అధినేత కేసీఆర్ పక్కా వ్యూహాలు రచించారు. అందుకు అనుగుణంగా ప్రచారసరళి చేపట్టారు. ప్రతీ ఓటరు కీలకమని కేడర్‌కు సూచించడంతో గురువారం ఎన్నికల పోలింగ్ సరళిపై పరిశీలన చేశారు. గంటగంటకు సర్వే రిపోర్ట్ తెప్పించుకొని ఏ జిల్లాలో తక్కువ పోలింగ్ నమోదైంది, అందుకు గల కారణాలు ఏమిటి అనేది అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కేడర్‌కు సైతం పోలింగ్ శాతం పెంచేలా పలు సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ పనితీరుపట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, విజయం తథ్యమని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.
గత పర్సంటేజీ వస్తుందని ఆశలు
2018లో బీఆర్ఎస్ పార్టీకి 46.8 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి కూడా అలాగే వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తున్నది. పోలింగ్ శాతం ఒకటీ రెండు శాతం తగ్గినా ప్రభుత్వానికి ఢోకాలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది. బీఆర్ఎస్‌కు ఉన్న ఓటు బ్యాంకు మాత్రం మరో పార్టీకి బదిలీ కాలేదని, ప్రభుత్వ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈసారి కూడా బీఆర్ఎస్‌కు 40 శాతానికి పైగా ఓట్లు వస్తాయనే ధీమాతో ఉన్నారు. ఈ అంచనాలు సక్సెస్ అవుతాయా? తారుమారు అవుతాయా? అనేది చూడాలి.