బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్..!

by Anjali |
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్..!
X

దిశ, వీణవంక: అవినీతి ఆరోపణలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరియు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల విధితమే. అయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీణవంకలోని తన స్వగృహం నుంచి హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లేందుకు యత్నించగా అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి స్వగృహం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకొవద్దని.. ముందస్తు నిర్ణయంలో భాగంగా బీఆర్ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed