- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు అసెంబ్లీకి కేసీఆర్ రావడం కష్టమే.. శ్వేతపత్రంపై చర్చలో పాల్గొనేదెవరు?
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ శాసనసభా పక్ష పార్టీకి డిప్యూటీ లీడర్‌గా ఎవరిని నియమించాలనే దానిపై కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తున్నది. ఆనారోగ్య కారణంగా ఆయన ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ లీడర్ నియామకంపై ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే హరీశ్, కేటీఆర్‌ను కాదని మరో ఎమ్మెల్యేకు ఆ బాధ్యతలు అప్పగిస్తే రాజకీయంగా ఏ మేరకు ప్రయోజనం ఉంటుందనే కోణంలోనూ ఆలోచిస్తున్నారు.
అల్లుడు, కొడుకులకు బాధ్యతలు
ఈ నెల 21న అసెంబ్లీలో రాష్ట్ర అర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనుంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసినఅప్పులు, పెట్టిన ఖర్చుల వివరాలను వెల్లడించనుంది. కేసీఆర్ బదులుగా మాజీ మంత్రులు హరీశ్, కేటీఆర్‌లకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తున్నది. హరీశ్ తమ పాలనలో ఉన్న ఆర్థిక పరిస్థితులపై ఆధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.