BREAKING: సలకం చెరువులో ఆక్రమణలు ఎందుకు కూల్చరు: హైడ్రాపై బండి సంజయ్ సెటైర్లు

by Shiva |
BREAKING: సలకం చెరువులో ఆక్రమణలు ఎందుకు కూల్చరు: హైడ్రాపై బండి సంజయ్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘హైడ్రా’ కూల్చివేతలపై కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ మరోసారి సెటర్లు వేశారు. ఇవాళ హైదరబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవంల కక్ష సాధింపు చర్యల్లా ‘హైడ్రా’ కూల్చివేతలు ఉన్నాయని ఆరోపించారు. నగరంలోని అన్ని ఆక్రమణల విషయంలో ఆ సంస్థ ఒకేలా వ్యవహరించడం లేదని ఫైర్ అయ్యారు. వాళ్లు చేసే పని కరెక్ట్ అని అనుకుంటే సలకం చురువులో ఉన్న ఒవైసీ ఆక్రమణలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. కేవలం ఆ కాలేజీకి మాత్రమే ఏడాది పాటు సమయం ఎందుకిచ్చారో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా్ర్థుల అకాడమిక్ ఇయర్ కోల్పోతారని సంశయిస్తున్న ప్రభుత్వం వారందరికీ మరో టాప్ కాలేజీలో అడ్మీషన్లు ఇప్పిస్తే సరిపోతుందని అన్నారు. అందరకీ ఒకే న్యాయమైతే.. ఒవైసీ బ్రదర్స్‌కు సంబంధించిన కాలేజీని వెంటనే కూల్చివేయాలని బండి సంజయ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed