Varun Tej: వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాలో కాంతార నటుడు.. పోస్టర్ విడుదల

by Hamsa |   ( Updated:2024-10-27 14:53:42.0  )
Varun Tej: వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాలో కాంతార నటుడు.. పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), కరుణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’(Matka). భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం 1958 నుంచి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథగా రాబోతుంది. అయితే ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర(Naveen Chandra), అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, రవి శంకర్, సలోని కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే దీనిని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై డా. విజేందర్ రెడ్డి(Vijender Reddy) తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నవంబర్(November) 14న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ‘మట్కా’(Matka) మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, కాంతార మూవీ నటుడు కన్నడ కిషోర్(Kannada Kishore Kumar) పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఆయన నాని బాబుగా నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

Advertisement

Next Story