HYD: ఒరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే వివేకానంద, బాల్క సుమన్ అరెస్ట్

by Gantepaka Srikanth |
HYD: ఒరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే వివేకానంద, బాల్క సుమన్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఒరియన్ విల్లాస్(Orion Villas) వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్(KTR) బంధువు రాజ్‌ పాకాల(Raj Pakala) సోదరుడు శైలేంద్ర పాకాల(Shailendra Pakala) ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శైలేంద్ర పాకాల(Shailendra Pakala) ఇంటి వద్ద బీఆర్ఎస్(BRS) నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడకు స్పెషల్ పార్టీ పోలీసులు భారీగా చేరుకున్నారు. పరిస్థితి ముదిరి తోపులాట జరిగింది. దీంతో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద(MLA KP Vivekananda), మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) అరెస్ట్ అయ్యారు.

Advertisement

Next Story