Satheesh Reddy: వాళ్లంతా బీఆర్ఎస్‌ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు

by Gantepaka Srikanth |
Satheesh Reddy: వాళ్లంతా బీఆర్ఎస్‌ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలల గడుస్తున్నా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం అయిందని బీఆర్ఎస్ నేత వై. సతీష్ రెడ్డి(Satish Reddy) విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మహిళలకు ప్రతినెల రూ.2,500 ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా(BRS Social Media) పోరాటం చేస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాను అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కడా భయపడటం లేదు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) ఇలా అందరూ కలిసి బీఆర్ఎస్ సోషల్ మీడియా(BRS Social Media) కార్యకర్తలను బెదిరిస్తున్నారని అన్నారు. బెదిరింపులకు భయపడేది లేదని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా కార్యకర్తలు స్వచ్ఛందంగా పని చేస్తున్నారని చెప్పారు. ఎక్కువ పోస్టులు పెడితే గిఫ్టులు ఇస్తామని కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్లకు నేతలు అభయం ఇస్తున్నారు. అలా తాము చేయడం లేదని అన్నారు. జగ్గారెడ్డి బీఆర్ఎస్ సోషల్ మీడియాపై పనికిమాలిన మాటలు మాట్లాడారు. సంగారెడ్డి మహిళా కలెక్టర్‌ను అవమానించారు. అసలు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఏం తప్పు చేసిందో జగ్గారెడ్డి(Jaggareddy) చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల గౌరవం ఉంటే తక్షణమే జగ్గారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సవాల్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed