Janwada: రేవ్ పార్టీపై డీసీపీ ప్రెస్‌నోట్.. వెలుగులోకి సంచలన విషయాలు

by Ramesh Goud |
Janwada: రేవ్ పార్టీపై డీసీపీ ప్రెస్‌నోట్.. వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జన్వాడ(Janwada) ఫామ్‌హౌజ్ రేవ్ పార్టీపై రాజేంద్రనగర్ డీసీపీ(Rajendranagar DCP) ప్రెస్‌నోట్(Press Note) విడుదల చేశారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ‌న్వాడలోని రాజ్ పాకాల(Rajpakala)కు చెందిన ఫామ్‌హౌస్‌పై నిన్న అర్థరాత్రి సమయంలో లోకల్ పోలీసులు, ఎస్ఓటీ, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో దాడి జరిగిందని తెలిపారు. ఆ సమయంలో ఫామ్‌హౌజ్‌లో 21మంది పురుషులు, 14 మంది స్త్రీలు ఉన్నారని అన్నారు. ఈ దాడిలో 7 విదేశీ మ‌ద్యం బాటిళ్ళు, 10 లోక‌ల్ మ‌ద్యం బాటిళ్ళు, ఇతర గేమింగ్ ఐట‌మ్స్‌ను గుర్తించినట్లు తెలిపారు. ఫామ్‌హౌజ్ లో ఉన్న పురుషులకు డ్రగ్స్ టెస్ట్ చేశామని, ఇందులో విజ‌య్ మ‌ద్దూరి కొకైన్ తీసుకున్నట్టు డ్రగ్ టెస్ట్‌లో తేలిందని, అత‌నిని ర‌క్త ప‌రీక్షల కోసం ఆస్పత్రికి త‌ర‌లించారని అన్నారు. అంతేగాక రాజ్ పాకాల‌పై ఎన్డీపీసీ యాక్ట్ 25, 27, 29 తో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3, 4 సెక్షన్ల కింద‌ మొకిల పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఎక్సైజ్ శాఖ నుంచి అనుమ‌తులు తీసుకోకుండా పార్టీ నిర్వహించినందుకు ఎక్సైజ్ యాక్ట్ 34ఏ, 34(1) సెక్షన్ల కింద ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారని ప్రెస్ నోట్ విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed