MLA Anirudh Reddy : జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా మార్చండి..

by Naveena |
MLA Anirudh Reddy : జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా మార్చండి..
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల ను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ( Cm revanth Reddy)జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి( Mla anirudh ) విజ్ఞప్తి చేశారు. ఆదివారం నాడు సీఎంను కలిసిన అనిరుధ్ రెడ్డి (mla anirudh ) జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడారు. బాలానగర్ ను మునిసిపాలిటీ గా మార్చాలని కూడా కోరారు. సీఎం ను కలిసిన అనిరుధ్ ముఖ్యంగా జడ్చర్ల ను రెవెన్యూ డివిజన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ డివిజన్ కావడానికి అన్ని అర్హతలు జడ్చర్ల కు ఉన్నాయని తెలిపారు. దీంతో జడ్చర్ల ప్రాంతంలో భూ సమస్యలు పరిష్కరించడానికి, వందల కోట్ల విలువైన గైరాన్, భూదాన్ ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో వస్తున్న సాగు నీటి ప్రాజెక్టులను గురించి ప్రస్తావించారు. జడ్చర్ల కు రైలు, రోడ్డు వసతులు ఉన్నాయని, 44 వ నంబర్, 167 వ నంబర్ జాతీయ రహదారులు జడ్చర్ల మీదుగానే వెళ్తున్నాయని, స్థానిక స్థానికేతరులు జనాభా 4.5 లక్షల వరకూ ఉందని తెలిపారు. ఈ విషయంగా సీఎం రేవంత్ రెడ్డి ( Cm revanth Reddy ) సానుకూలంగా స్పందించారని, అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన రెవెన్యూ డివిజన్లు, మండలాలను గురించి ఒక అధికారిక కమిటీ వేస్తామని, ఆ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చిన అనంతరం ఈ విషయంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్( Cm revanth Reddy )హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ( mla anirudh ) వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed