- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్.. విద్యుత్ కమిషన్ చైర్మన్‌ను మారుస్తూ సుప్రీం తీర్పు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, కమిషన్ తరఫున గోపాల్‌శంకర్ నారాయణన్ తమ వాదనలు వినిపించారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చారంటూ కోర్టు ఆక్షేపించింది. నింబంధనలకు విరుద్ధంగా కమిషన్ చైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టడం సరికాదని పేర్కొంది. అయితే, వెంటనే కమిషన్ చైర్మన్‌ను మార్చాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్‌కు కొత్త చైర్మన్ పేరును వెల్లడిస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.