BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం.. నిందితుడు రాధాకిషన్ రావుకు అస్వస్థత

by Shiva |
BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం.. నిందితుడు రాధాకిషన్ రావుకు అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మొదటి రోజు కస్టడీ ముగిసింది. దర్యాప్తు బృందం అతడిని విచారించి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లకే పరిమితం కాలేదని, ఆధారాల ధ్వంసం కుట్రలోనూ ఆయన పాత్ర ఉందని మొదటి రోజు విచారణలో వెల్లడయ్యింది. అయితే రెండో రోజు విచారణలో భాగంగా ఇవాళ రాధాకిషన్ రావు విచారిస్తుండగా బీపీ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో దర్యాప్తు సిబ్బంది బంజారా హిల్స్ పీఎస్‌కే వైద్యులను పిలిపించారు.

ప్రస్తుతం అక్కడే వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. కాగా, ఫోన్ టాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధా‌కిషన్ రావును తమ కస్టడీకి కోరుతూ.. పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు ఆయనను10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ నెల 4 నుంచి 10 రాధాకిషన్ పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాధాకిషన్‌ రావు A4గా ఉన్నారు.

Next Story

Most Viewed