- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సర్టిఫికెట్స్ ఇవ్వని కాలేజీలను బ్లాక్ లిస్టులో పెట్టండి
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్ అందలేదని, విద్యార్థులు ఆ ఫీజులు స్వంతంగా చెల్లిస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తామని బెదిరిస్తున్న పలు కాలేజీలపై ఉన్నత విద్యాశాఖ కొరడా జులిపించనుంది. అలాంటి కాలేజీలను గుర్తించి వెంటనే వాటిని బ్లాక్ లిస్టులో పెట్టాలని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ ను ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఈ మేరకు ఓయూ, కాకతీయ. జేఎన్టీయూహెచ్, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, జేఎన్ఏఎఫ్యూ, తెలంగాణ మహిళా వర్శిటీల రిజిస్ట్రార్లకు లేఖ రాసింది. పలు ప్రైవేట్ కాలేజీలు తమ సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో వివిధ కోర్సుల్లో, ఉద్యోగాల్లో చేరేందుకు ఇబ్బందులకు గురవుతున్నామంటూ పలువురు తమ దృష్టికి తీసుకు వచ్చారని, తమ పరిధిలోని అన్ని కాలేజీలకు ఈ విషయాన్ని సూచించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని విద్యామండలి ఆ లేఖలో పేర్కొంది. ఈ ఆదేశాలను పాటించని కాలేజీలను బ్లాక్ లిస్టులో పెట్టి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.