- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో BJP ఆశలన్నీ తలకిందులు.. 10 సీట్లకు మించి రావని తేల్చేసిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్!
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే ఉంది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అధికారం చేజిక్కుంచుకునేదెవరు? అనే అంశాలపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాగా, వాటి ఫలితాలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యమంత్రి హ్యాట్రిక్ కొడతారా? లేక ప్రజలు గద్దె దింపుతారా? అనే సందేహాలకు ఆదివారం సమాధానం దొరకనుంది. పదేండ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ వైపే ఎగ్జిట్ పోల్స్ ఉండటంతో ఆ పార్టీ నేతలంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే బీజేపీ విషయానికి వస్తే మాత్రం సీన్ రివర్స్ అయింది. ఆ పార్టీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
చేజారిన ఏకైక ఆప్షన్
ఈ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దక్షిణాదికి గేట్ వేగా కమలం పార్టీ తెలంగాణను ఎంచుకుంది. అయితే ఇప్పటికే సౌత్ స్టేట్స్‌లో అధికారంలో ఉన్న కర్ణాటకను చేజార్చుకుంది. ఇక ఆ పార్టీ ఆశలు పెట్టుకున్న ఏకైక ఆప్షన్ తెలంగాణను సైతం వదులుకోక తప్పడంలేదని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అధికారంలోకి వస్తామని, బీసీనే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ నాయకులు, కార్యర్తలు కలలు కన్నారు. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్‌తో వారిప్పుడు నిరాశకు లోనయ్యాయి. పలు సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి 10 సీట్లు దాటలేదు. గరిష్టంగా 10 సీట్లుగా పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ షాక్ ఇచ్చేలా ఉండటంతో ఆ పార్టీ నేతలంతా సందిగ్ధంలో పడ్డారు. పలువురు ఏమీ పాలుపోని పరిస్థితిలో ఉన్నారు.
పార్టీలో భిన్నాభిప్రాయాలు
ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి వచ్చిన స్థానాలపై ఆ పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌ను పలువురు బీజేపీ నేతలు కొట్టిపారేశారు. అవేమీ ఫైనల్ కాదని అంటున్నారు. ఇక మరికొందరు నేతలు మాత్రం గతంతో పోల్చుకుంటే బీజేపీ స్థితి మెరుగైందని, ఓటుబ్యాంకు పెరిగిందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైన కాషాయ పార్టీ, రెండు బైపోల్స్‌లో నెగ్గి మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ ఎన్నికల్లో 3వ స్థానం నుంచి మరిన్ని సీట్లు అదనంగా రాబోతున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా అసలు ఏమాత్రం ఉనికిలేని స్థానాల్లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరుగుతుందని అంటున్నారు. గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉండబోతోందని భావిస్తున్నారు.
ఎన్ని సీట్లు వచ్చినా అధికారం మాదే
ఇదిలా ఉండగా ఇటీవల పలువురు బీజేపీ నేతలు సీట్లు ఎన్ని వచ్చినా అధికారం మాత్రమే తమ పార్టీదేనని బాహటంగానే చెప్పారు. బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గతంలో హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా తెలంగాణలో హంగ్ వస్తుందని, అధికారం బీజేపీయే చేపడుతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సైతం బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా అధికారం కాషాయ పార్టీదేనని మీడియా ముఖంగానే చెప్పారు. వారు చేసిన కామెంట్స్ వెనుకున్న మర్మమేంటనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈనెల 3వ తేదీ రిజల్ట్స్ తర్వాతే దీనికి సమాధానం దొరకనుంది.