తెలంగాణలో తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి.. అసెంబ్లీ వేదికగా BJP ఎమ్మెల్యే కీలక డిమాండ్

by Satheesh |   ( Updated:2024-07-27 10:26:56.0  )
తెలంగాణలో తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి.. అసెంబ్లీ వేదికగా BJP ఎమ్మెల్యే కీలక డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్రం నుండి వచ్చే నిధులు రావని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం అమలు చేస్తామని చెప్పిందని.. జూలై ముగుస్తున్న ఇంకా అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ ద్వారా నిధులు దొరికేవని కానీ పదేళ్లుగా ఆ కార్పొరేషన్లలో ఫండ్స్ లేవని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా కాకుండా కాంగ్రెస్ అయిన ప్రజా సమస్యలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో గ్రామ పంచాయతీ పాలక వర్గాల పాలన ముగిసింది. దీంతో అప్పటి నుండి ప్రత్యేక ఆఫీసర్ల పాలన నడుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రివ్యూ నిర్వహించి.. వీలైనంతా త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు జరిగి అవకాశ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed