బీజేపీ నేతలు మోసగాళ్లకు మోసగాళ్లు.. జగ్గారెడ్డి ఫైర్

by Rajesh |
బీజేపీ నేతలు మోసగాళ్లకు మోసగాళ్లు.. జగ్గారెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేతలు మోసగాళ్లకు మోసగాళ్లు అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నమ్మించి మోసం చేసే నైజం బీజేపీలో ఉందని తెలిపారు. ఓట్ల కోసం దేవుడిని తీసుకొచ్చి ముందు పెడుతున్నారన్నారు. వేరే రాష్ట్రాల్లో చేసినట్లు జిమ్మిక్కులు ఎన్ని చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు పక్కా ఉంటుందన్నారు. 68 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు కూలిపోతుందన్నారు. దేవుడిని చూపించి ప్రజల్లో బీజేపీపై ఉన్న కోపాన్ని తగ్గిస్తున్నారన్నారు. 2014లో రూ.28 వేలు ఉన్న బంగారం ధర రూ.70 వేలకు తెచ్చారన్నారు.

Advertisement

Next Story