- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్కే సవాల్ విసురుతావా?: సుభాష్
దిశ, తెలంగాణ బ్యూరో: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణాలు చేసి, తన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, త్వరలోనే దర్యాప్తు సంస్థల దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ హెచ్చరించారు. 'అసలు నీ స్థాయికి, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కడు చాలని, నువ్వు ఎన్ని అబద్దపు సవాళ్ళు విసిరినా.. చివరికి నీ మీద ఉన్న కేసుల్లో నువ్వు జైలుకు వెళ్లక తప్పదు' అని ఎన్వీ సుభాష్ ఆదివారం ఒక ప్రకటనలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన రోహిత్.. బండి సంజయ్కు సవాల్ విసిరే స్థాయి నీకు లేదని మండిపడ్డారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. ముందు బండి, కేసీఆర్కు విసిరిన సవాల్ను స్వీకరించి, కేసీఆర్ యాదగిరిగుట్ట నరసింహ స్వామి ఆలయానికి వచ్చి, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు రాలేదు కాబట్టి, ఎమ్మెల్యేలకు ఎర కేసు అంతా కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. మొయినాబాద్ ఫాంహౌజ్లో కేసీఆర్ డైరెక్షన్లో ఆడిన డ్రామాలో కూడా నిజానిజాలు నిగ్గు తేలుతాయని, అందులో ఎవరి ప్రమేయం ఏంటో కూడా త్వరలోనే బయటపడుతుందని వెల్లడించారు. 2009 ఎన్నికల సందర్భంగా స్వీడన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ చదివినట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న రోహిత్, 2018 ఎన్నికల సమయంలో ఇంటర్ పాస్ అయినట్టు అఫిడవిట్ ఇచ్చారని ఆరోపించారు. రోహిత్ ఇంటర్ పాస్ కాకుండానే.. ఎంఎస్ చదివావా..? అని ఎన్వీ సుభాష్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల దొంగ దందాలు, స్కామ్లే కాకుండా, దొంగ విద్యార్హతలతో ఎన్నికల సంఘాన్ని కూడా తప్పుదోవ పట్టించారని విమర్శించారు. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన పైలట్ రోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని, అతనిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.