అయోధ్య విషయంలో కాంగ్రెస్ నిర్ణయం కరెక్ట్ కాదు: కిషన్ రెడ్డి

by GSrikanth |
అయోధ్య విషయంలో కాంగ్రెస్ నిర్ణయం కరెక్ట్ కాదు: కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రామ మందిర ప్రాణప్రతిష్ట కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీఆర్ఎస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణిని మరోసారి బయటపెట్టిందని విమర్శించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని అన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. జనవరి 22 కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. అనంతరం మాల్దీవుల ఇష్యూ గురించి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత భారత పర్యాటన రంగానికి మద్దతు వెల్లువెత్తుతోందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed