- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మట్టి ట్రాక్టర్ బీభత్సం.. మహిళ పరిస్థితి విషమం
దిశ, గద్వాల : గద్వాల పట్టణంలో తెల్లవారుజామున మట్టి ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. సంతాన వేణుగోపాల స్వామి జాతర సందర్భంగా కృష్ణానది వెళ్లే అగ్రహారం రోడ్డులో వేసుకున్న మిఠాయి దుకాణాల మీదకి మట్టి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో గద్వాల పట్టణం బీసీ కాలానికి చెందిన సరోజమ్మ (60) భర్త టికే దౌలు అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు బంధువుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మహిళ తలకి తీవ్ర గాయాలు అయ్యి రక్తస్రావం ఎక్కువగా అవుతుండటంతో పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ల సూచనతో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కాగా రాత్రి నుండి మట్టి ట్రాక్టర్లు మట్టి కొడుతున్నాయని డ్రైవర్ అతివేగం నిద్ర మత్తులో ట్రాక్టర్ నడపటంతోనే మిఠాయి దుకాణం లోకి ట్రాక్టర్ దూసుకువచ్చిందని బాధితులు తెలిపారు.