Ponguru Narayana:టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. మంత్రి నారాయణ కీలక ప్రకటన

by Jakkula Mamatha |   ( Updated:2024-12-24 04:33:10.0  )
Ponguru Narayana:టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) తెలిపారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన టిడ్కో గృహాల పై సమీక్ష జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం పై మంత్రి నారాయణ నిప్పులు చెరిగారు. గత వైసీపీ(YSRCP) ప్రభుత్వం టిడ్కో ఇళ్లను(Tidco Houses) గందరగోళం చేసిందని మండిపడ్డారు. 7 లక్షల ఇళ్లను గత ప్రభుత్వం 2 లక్షలకు తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ సర్కార్ టిడ్కో ఇళ్ల పై లోన్ తీసుకుని.. నిధులను పక్కదారి పట్టించారు.

బ్యాంకు లోన్లు క్లియర్ చేసి వచ్చే జూన్ లోపు లక్ష ఇళ్లు పూర్తి అయ్యేలా చూడమని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ వరకు 1.18 లక్షల టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి, ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన 44 వ సీఆర్డీఏ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి పనులు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ఇప్పటికే బ్యాంకు రుణాలు(Bank Loans) తీసుకుని నాన్ పెర్ఫార్మింగ్ ఎస్సెట్స్‌గా మిగిలిన పోయిన టిడ్కో గృహాలను పూర్తి చేయడానికి రూ.102 కోట్లను చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed