'కేసీఆర్‌కు జాతీయ పార్టీ పెట్టే అర్హత లేదు'

by GSrikanth |   ( Updated:2022-12-10 06:56:27.0  )
కేసీఆర్‌కు జాతీయ పార్టీ పెట్టే అర్హత లేదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ కు జాతీయ పార్టీ పెట్టే అర్హత లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణలో ఏం సాధించారని జాతీయ పార్టీ పెడుతున్నారో చెప్పాలని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు రాత్రిలో కలలో కూడా ప్రధాని నరేంద్ర మోడీనే వస్తున్నాడని, బీఆర్ఎస్ నేతలకు బీజేపీ భయం పట్టుకుందన్నారు. ఆ భయంతోనే కేసీఆర్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె కేసీఆర్ వద్ద తెలంగాణలో దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆ డబ్బుతోనే దేశాన్ని ఏలుతానని అనుకుంటున్నాడని, కానీ అది ఎన్నటికి జరగదన్నారు. బీఆర్ఎస్ ను చూసి బీజేపీ భయటపడుతోందన్న మాటల్లో వాస్తవం లేదని తుపాకి రాముళ్లను చూసి ఎవరూ భయపడరన్నారు. అవినీతి పరులను చూసి భయపడే పార్టీ బీజేపీ కాదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని బయటకు తీస్తామన్నారు. అవినీతిలో కూరుకుపోయిన సీఎం కేసీఆర్ బీజేపీని ప్రశ్నించే అర్హత కూడా లేదన్నారు. ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ పార్టీ ఎట్లా అవుతుందని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed