- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ స్టార్ట్.. ఏ క్షణమైనా థర్డ్ లిస్ట్ రిలీజ్
దిశ వెబ్‌డెస్క్: బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాపై చర్చించనున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏ క్షణమైనా తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడవ జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే బీజేపీ 53 మంది అభ్యర్థులతో రెండు లిస్ట్‌లను విడుదల చేసింది.
మొదటి జాబితాలో 52 మంది పేర్లు ప్రకటించిన కమలం పార్టీ.. రెండవ లిస్ట్‌లో కేవలం ఒకే పేరుతో జాబితాను రిలీజ్ చేసింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ తాజాగా భేటీ అయ్యింది. ఈ భేటీ తర్వాత మిగిలిన 66 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించనుంది. మరి కాసేపట్లో అభ్యర్థుల లిస్ట్ విడుదల కానుండటంతో బీజేపీ టికెట్ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లిస్ట్‌లో తమ పేరు ఉంటుందో లేదో అని ఆశావహుల్లో సస్పెన్స్ నెలకొంది.