రానున్న రెండు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!

by Anjali |   ( Updated:2024-05-14 14:32:54.0  )
రానున్న రెండు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మళ్లీ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తనం ఒకటి పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0. 9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు దిశ నుంచి వీస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

కాగా, తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణలో పలు జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏంబీఎన్ఆర్, నాగర్ కర్నూల్, ములుగు, నల్గొండ, నారాయణపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story