- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దశాబ్ది వేడుకల వేళ.. ఆరు నెలలుగా జీతాలు లేక గెస్ట్ లెక్చరర్ల ఆవేదన
దిశ, తెలంగాణ బ్యూరో: ఆరు నెలలుగా వేతనాలు చెల్లించక మమ్మల్ని ముంచి మీరు ఉత్సవాలు చేసుకుంటారా అని గెస్ట్ లెక్చరర్లు మండిపడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబ పోషణ భారంగా మారి మేం ఇబ్బందులు పడుతుంటే దశాబ్ది వేడుకలు నిర్వహించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నా మీకు పట్టదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబురాలు మీరే చేసుకుంటారా, మాకొద్దా అని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. పదేండ్లయినా తమ బతుకులు మారడం లేదని వాపోతున్నారు. జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవు కానీ.., వేడుకలు నిర్వహించేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీస్తున్నారు.
వేతనాలు అందక వెతలు
తెలంగాణలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,654 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరికి గతేడాది జూన్ వేతనంతో పాటు గతేడాది నవంబర్ నుంచి మార్చి నెల వరకు మొత్తం ఆరు నెలల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. ఏడు నెలలుగా జీతాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇంటి అద్దె సైతం చెల్లించలేక సతమతమవుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలతో 300 మంది అతిథి ఆధ్యాపకులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
అమలు కాని సీఎం హామీ
గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అతిథి ఆధ్యాపకులకు 12 నెలల వేతనాన్ని చెల్లిస్తామని ప్రకటించారు. నెలలు దాటుతున్నా నేటికీ అది అమలుకు నోచుకోలేదు. సంబంధిత అధికారులు గెస్ట్ లెక్చరర్ల ఇబ్బందులపై దృష్టిసారించి 12 నెలల వేతనాలు అందించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. పీరియడ్ విధానాన్ని రద్దు చేస్తూ కన్సాలిడేట్ పేతోని ఈ విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేయాలని కోరుతున్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 1,654 మంది అతిథి అధ్యాపకుల కుటుంబాలను ఆదుకొని, తెలంగాణ దశాబ్ది వేడుకల సంతోషాలను తమ కుటుంబాల్లో నింపాలని ప్రభుత్వానికి ఏకరువు పెడుతున్నారు.
కుటుంబ పోషణ భారం
- బొమ్మినేని సురేందర్ రెడ్డి, మ్యాథ్స్ అతిథి అధ్యాపకుడు
జీతాలు లేక 7 నెలలు అయింది. బయటి నుంచి అప్పులు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మేము ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కనికరించడంలేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. 12 నెలల వేతనాన్ని అందించాలి. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా సేవలు అందిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి.