న్యూసెన్స్ కేసులో ఇద్దరు అరెస్ట్.. పోలీసులపై ఫైర్ అయిన కోర్టు

by Mahesh |
న్యూసెన్స్ కేసులో ఇద్దరు అరెస్ట్.. పోలీసులపై ఫైర్ అయిన కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: నాంపల్లి న్యాయస్థానం పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. వివరాల్లోకి వెళితే.. ఓ న్యూసెన్స్ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల కిందట అరెస్ట్ చేయగా.. మూడో రోజు తర్వాత కోర్టులో హాజరుపర్చడంపై నాంపల్లి కోర్టు ఫైర్ అయింది. అయితే ఈ మూడు రోజుల్లో ఆ ఇద్దరు వ్యక్తులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేసిన వారికి హత్యాయత్నం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. అలాగే.. సదరు నిందితులను పోలీసుల కస్టడీకి ఇవ్వాలని కోరగా నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నిందితులను రిమాండ్ పంపడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed