- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ వాసులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ కార్డ్ లేకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపు..!
దిశ, తెలంగాణ బ్యూరో: రేషన్ కార్డు లేకున్నా, ఆరోగ్య శ్రీ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా వైద్యారోగ్యశాఖ చర్యలు మొదలు పెట్టింది. సీఎం సూచనతో ఆరోగ్య శ్రీ పథకం ఇంప్లిమెంట్‌పై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. రేషన్ కార్డులు లేకుండా ఆరోగ్య శ్రీకార్డులను ఎలా ఎంపిక చేయాలి..? ఏ ప్రాతిపాదికన అర్హతను ఫైనల్ చేయాలి..? ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్ని రద్దు చేస్తూ తీసుకురాబోతున్న కొత్త రూల్‌తో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదా..? వంటి తదితర అంశాలపై అధికారులు స్డడీ చేస్తున్నారు. దీంతో పాటు ఆరోగ్య శ్రీ కార్డుపై స్పీడ్‌గా వైద్యం అందించేందుకు గ్రీన్ ఛానల్ సిస్టం ఏర్పాటుకు కూడా ప్రణాళికను తయారు చేస్తున్నారు.
అంతేగాక ప్రస్తుతం ఆరోగ్య శ్రీలో ఉన్న ప్రొసీజర్లు, ఆసుపత్రుల ధరల పెంపుపైనా అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు. పేదల ట్రీట్మెంట్‌ను వేగంగా అందించేందుకు అవసరమైన చర్యలన్నీ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ లిమిట్ రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచగా, కొత్త విధానాలపై సీఎంకు ఓ నివేదిక సమర్పించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆయన నిర్ణయం తర్వాత ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నదని వెల్లడించారు.