- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఈడీ స్పెషల్ ఎడ్యుకుషన్‌కు దరఖాస్తులు
దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ వర్సిటీలో బీఈడీ(ఓడీఎల్), బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశాలకు వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. వచ్చే నెల 22వ తేదీ వరకు అప్లికేషన్ గుడువును అధికారులు విధించారు. విద్యార్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని విశ్వవిద్యాలయ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వర్సిటీ పోర్టల్ www.braouonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.750 గా నిర్ణయించారు.
ఇతరులకు రూ.1000 గా నిర్ణయించారు. ఇదిలా ఉండగా జూన్ 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రల్లోని పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బీఈడీ ఓడీఎల్ పరీక్ష, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు పరీక్షకు రెండ్రోజుల ముందు www.braou.ac.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.