మీ రాష్ట్రాన్ని మీరు చూసుకోండి.. తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రి సీరియస్

by GSrikanth |   ( Updated:2023-05-06 08:14:54.0  )
మీ రాష్ట్రాన్ని మీరు చూసుకోండి.. తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రి కొట్టు నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత తెలంగాణ నాయకులకు లేదని మండిపడ్డారు. మీరు మీ రాష్ట్రాన్ని చూసుకోండి.. సంపూర్ణంగా తెలంగాణను అభివృద్ధి చేశాక ఏపీ గురించి మాట్లాడండి అంటూ ఘాటుగా స్పందించారు. ముందు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని అని సెటైర్లు వేశారు. ఆంధ్రా ప్రజలు చేసిన అభివృద్ధే నేటి తెలంగాణ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఆరు నెలల్లో ఎన్నికలు ఉంటాయని, మీ భవిష్యత్తు ఏంటో చూసుకోండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Read More: ‘రైతులను రెచ్చగొట్టాలని చూసి చంద్రబాబు అభాసుపాలయ్యాడు’

Advertisement

Next Story