AP DCM : పోరాట స్ఫూర్తి ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో ఉంది.. సెప్టెంబర్ 17 పవన్ కళ్యాణ్ సందేశం

by Ramesh N |   ( Updated:2024-09-17 14:48:08.0  )
AP DCM : పోరాట స్ఫూర్తి ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో ఉంది.. సెప్టెంబర్ 17 పవన్ కళ్యాణ్ సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ పౌరులందరికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశమంతటికీ 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య ఫలాలు దక్కినా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు ఆ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోడానికి మరో 13 నెలలు వేచి చూడాల్సి వచ్చిందన్నారు.

మన దేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య చేపట్టడంతో నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. సెప్టెంబర్ 17న స్వేచ్ఛ పొంది స్వతంత్ర భారతంలో భాగమైందన్నారు. నిజాం ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం తాలూకు స్ఫూర్తి ఇప్పటికీ ప్రజల్లో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed