బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు MLCలు..!

by Rajesh |
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు MLCలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పదేళ్ల పాటు అప్రతిహసంగా కొనసాగిన బీఆర్ఎస్ చరిష్మా క్రమంగా తగ్గుతోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఘోర ఓటమి.. ఎంపీ ఎన్నికల్లో జీరో స్థానాలకు పడిపోవడంతో ఆ పార్టీ నుంచి క్రమంగా నేతలు చేజారుతున్నారు. కారు దిగి అధికార పార్టీలోకి చేరుతున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలె యాదయ్యలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ సోమవారం లేదా మంగళవారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ సారయ్యతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కొంతసేపు ఏకాంతంగా చర్చించినట్లు తెలిసింది. అయితే ఆయనతో పాటు ఒకేసారి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed