మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తోన్న వేళ.. కేసీఆర్‌కు బిగ్ షాక్

by GSrikanth |   ( Updated:2022-09-13 06:35:08.0  )
మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తోన్న వేళ.. కేసీఆర్‌కు బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా దుబ్బాక, హుజురాబాద్‌‌లో ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. రాష్ట్రంలో రాబోయేది తమ ప్రభుత్వమే అంటూ మాంచి జోష్‌లో ఉన్న బీజేపీకి ఎలాగైనా చెక్‌ పెట్టాలని చూస్తోంది. అయితే, ఈ క్రమంలో టీఆర్ఎస్‌కు మరో అనూహ్య షాక్ తగిలింది. మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన సమితి ఎప్పటినుంచో ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఉప ఎన్నికలకు ముందే జిల్లాను సాధించుకోవాలని చూస్తోన్న సమతి సభ్యులు టీఆర్ఎస్‌కు భారీ ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించకపోతే మునుగోడులో వెయ్యి మంది నామినేషన్లు దాఖలు చేసి, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని జిల్లా సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యుడు జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు. అన్ని అర్హతలు ఉన్నా.. ఇంతకాలం మిర్యాలగూడను జిల్లా చేయకపోవడం దారుణం అన్నారు. 60 రోజులుగా తాము ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల వేళ తమ డిమాండ్‌ను పరిష్కరించకపోతే, మునుగోడులో టీఆర్ఎస్‌ను ఓడించి తీరుతామని హెచ్చరించారు.

Also Read : 'CM KCR శాసన సభ అనగానే భయపడుతున్నారా..?'


Also Read : ఊర్లలో చిచ్చు రేపుతోన్న ఆ ఖర్చు.. మునుగోడులో సర్పంచ్‌లకు కొత్త టెన్షన్!

Advertisement

Next Story

Most Viewed