- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలి : ఎంపీ రఘునందన్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సూర్యాపేట- సిరిసిల్ల జాతీయ రహదారి 365 బీ ప్రతిపాదిత మార్గంపై ఆయా గ్రామాల రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని నేషనల్ హైవే అధికారులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో సూర్యాపేట- సిరిసిల్ల జాతీయ రహదారి 365 బీ ప్రతిపాదిత మార్గంతో ప్రభావితం అవుతున్న రైతులు, నేషనల్ హైవే అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణ డీపీఆర్ ను తయారు చేసిన ఏజెన్సీ ప్రతినిధి మురళి ప్రొజెక్టర్ ద్వారా దుద్దెడ నుండి సిరిసిల్ల వరకు ప్రతిపాదిత రహదారి మ్యాప్ ను చూపించి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...దుద్దెడ నుండి రామంచ వరకు గ్రామాల మీదుగా వెళ్తున్న ప్రతిపాదిత రోడ్డు పై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
దుద్దెడ నుంచి రాజీవ్ రహదారి మీదుగా సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వరకు జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తూ 756 డిజి కలపడం, లేని పక్షంలో వెలికట్ట నుంచి బందారం మీదుగా సిద్దిపేట రీజనల్ రింగ్ రోడ్డు మీదుగా రామంచ వరకు, అదే విధంగా దుద్దెడ నుండి తుక్కాపూర్, ఘణపూర్ మీదుగా ఇర్కోడ్ వరకు అక్కడ నుండి 765 రహదారితో కలిసి రామంచ వరకు ఈ మూడు మార్గాలను పరిశీలించాలని నేషనల్ హైవే అధికారులకు సూచించారు. కొత్తగా ప్రతిపాదిత మార్గాల్లో ఏ మార్గం రైతులకు అనుకూలంగా ఉంటుందో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, అదనపు కలెక్టర్లు అబ్దుల్ హమీద్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, నేషనల్ హైవే ఈఈ బలరామకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.