- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM రేవంత్ బంపర్ ఆఫర్‌ను తిరస్కరించిన అక్బరుద్దీన్ ఒవైసీ.. సభలో అసలేం జరిగిందంటే..?
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎల్పీ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ బీ ఫామ్‌పై కొడంగల్ నియోజవర్గం నుండి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని, చీఫ్ ఎన్నికల ఏజెంట్‌గా ఉండి అక్బరుద్దీన్‌ను గెలుపు కోసం కృషి చేస్తానన్నారు.
అక్బరుద్దీన్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి అసెంబ్లీలో నా పక్కనే కూర్చొబెట్టుకుంటానని రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై వెంటనే అక్బరుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీలో నేను సంతోషంగానే ఉన్నానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానని రేవంత్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ కామెంట్స్‌కు అసెంబ్లీలో హాల్‌లోని సభ్యులంతా నవ్వారు.