- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హెచ్ఎం పెట్టే బాధలు భరించలేం
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండల పరిధిలోగల మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పెట్టే బాధలు భరించ లేకపోతున్నామని విద్యార్థులు వాపోయారు. కారణం లేకుండా ప్రధానోపాధ్యాయురాలు పెట్టిన బాధలు తట్టుకోలేక ఉదయం జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కాలినడకన వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమపై ప్రధానోపాధ్యాయురాలు రోజూ ఏదో కారణాల చేత మందలించడం సహించలేకపోతున్నామని, సుమారుగా 46 మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తినడానికి సరైన భోజనం ,ఉండడానికి హాస్టల్లో ఫ్యాన్లు, లైట్లు లేక ఇబ్బంది పడుతున్నామని, పలుమార్లు విన్నవించడంతో తిరిగి మమ్మల్నే ప్రధానోపాధ్యాయురాలు
మందలిస్తుందని తెలిపారు. ఈ విషయమై అర్ధరాత్రి ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే కనీసం పట్టించుకునే వారు లేరని వాపోయారు. వెంటనే సంబంధిత ప్రధానోపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించాలని కోరారు. దీనిపై స్పందించిన పలువురు విద్యార్థి సంఘాల నాయకులు సదరు ప్రధాన ఉపాధ్యాయురాలు గతంలో కూడా వివిధ చర్యలకు పాల్పడ్డారని, వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు విద్యార్థులకు పలువురు అధికారులు, పోలీసులు నచ్చచెప్పడంతో పాఠశాలకు తిరిగి వెళ్లారు. ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ కు నివేదిస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
- Tags
- Student protest