శివనామస్మరణతో మారుమోగిన గోదావరి తీరాలు..

by Sumithra |   ( Updated:2023-02-18 10:37:53.0  )
శివనామస్మరణతో మారుమోగిన గోదావరి తీరాలు..
X

దిశ, జన్నారం : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం జన్నారం మండలంలోని తిమ్మాపూర్, చింతగూడ, బాదంపెళ్లి, ధర్మారం, కలమడుగు గోదావరి నదీతీరాలలో భక్తులు శివనామస్మరణతో పుణ్యస్నానాలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయా గ్రామాల సర్పంచులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. తిమ్మాపూర్ గోదావరి నదితీరంలో భక్తులకు తిమ్మాపూర్ గ్రామసర్పంచ్ జాడి గంగాధర్ ఆధ్వర్యంలో ఉచితంగా పండ్లు, అల్పాహారం మంచినీళ్లను అందజేశారు.

ధర్మారం గోదావరి నదితీరాన సన్రైజర్స్ యూత్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారము పంపిణీ చేశారు. ధర్మవరం గ్రామానికి చెందిన రమేష్ గోదావరి నది వద్ద మంచినీటిని పంపిణీ చేశారు. భక్తులతో కిటకిటలాడిన శివ మార్కండేయ ఆలయం మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Next Story