బాసర అమ్మవారి క్షేత్రంలో ఆత్మహత్యాయత్నం.. గతంలోను ఇలానే..!

by Mahesh |
బాసర అమ్మవారి క్షేత్రంలో ఆత్మహత్యాయత్నం.. గతంలోను ఇలానే..!
X

దిశ, బైంసా: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి ఆలయంలో మంగళవారం కలకలం రేగింది. గతంలో ఎన్నోసార్లు ఆలయంలో ఆత్మహత్యకు యత్నించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రసాద్ గౌడ్ మళ్లీ ఈ రోజు ఆలయంలో అధికారులు, భద్రతా సిబ్బంది, కళ్ళుగప్పి బ్లేడుతో మణికట్టును కోసుకున్నాడు. గతంలో కూడా పలు సార్లు అమావాస్య రోజే వచ్చి ఆలయంలో మణికట్టును కోసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

వెంటనే గమనించిన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అతనిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అమ్మవారి గర్భగుడి ముందరే బ్లేడుతో మణికట్టును కోసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యకు పూనుకోవడం ప్రసాద్ గౌడ్‌కి పరిపాటిగా మారింది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Next Story