ఈస్గాం శివ మల్లన్నను దర్శించుకున్న ఎస్పీ..

by Sumithra |
ఈస్గాం శివ మల్లన్నను దర్శించుకున్న ఎస్పీ..
X

దిశ, కాగజ్ నగర్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈస్గాం శివ మల్లన్న జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కొమరం భీం జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణంలోని ఈస్గాం శివ మల్లన్నను జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎస్పీకి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో శివునికి మంగళహారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆలయ ఆవరణలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. సిర్పూర్ నియోజకవర్గంతో పాటు బెల్లంపల్లి, మంచిర్యాల, కొమురం భీం, మహారాష్ట్ర ప్రజలు అధిక సంఖ్యలో శివ మల్లన్న దర్శనానికి ఏటా వస్తుండడం దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, చూడాలని అన్నారు.

వేసవి ఎండలు ప్రారంభం కావడంతో భక్తులకు త్రాగునీటి సదుపాయం కల్పించాలని, ప్రత్యేక దర్శనంతో పాటు ఆలయంలోనికి ప్రవేశించే క్యూలైన్లను పరిశీలించారు. రోడ్లపై వాహనాల రద్దీ దృశ్య ప్రత్యేక చర్యలు చేపట్టాలని వాహనాలు నిలిపేందుకు ఆలయ పరిసర ప్రాంతాల్లో చేసిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. దొంగతనాలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతర జరిగే రెండు రోజులు మహిళా భక్తులు ఆభరణాల పట్ల జాగ్రత్తలు పాటించాలని పలుఅంశాలపై అధికారులతో చర్చించారు. ఎస్పీ వెంట కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐ నాగరాజు ఈస్గం ఎస్సై తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed