- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలి
దిశ, ఆసిఫాబాద్ : రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు లతో కలిసి జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటి కారణాలపై కలెక్టర్ ఆరా తీశారు.
జాతీయ రహదారిపై పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహనాలను నియంత్రించాలని, ఇందుకోసం స్పీడ్ గన్ లను వినియోగించి ఫైన్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అధిక మొత్తంలో నేషనల్ హైవే పై జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలకు అతివేగంగా, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రధాన కారణమని చెప్పారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 45 బ్లాక్ స్పాట్ లను గుర్తించామని, విద్యాసంస్థలు ఉన్న చోట స్పీడ్ బ్రేకర్స్ అమర్చాలని, రోడ్డు అనవసరం ఉన్న వాటిని తొలగించాలని హైవే అధికారులకు సూచించారు.