శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే ప్రతి రైతు రాజే

by Sumithra |
శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే ప్రతి రైతు రాజే
X

దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో భాగంగా సోమవారం కిసాన్ మేళా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉత్తర తెలంగాణ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా జగిత్యాల సంచాలకులు డా. శ్రీనివాస్ మాట్లాడారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికతపైన అవగాహన పెంచుకోవాలి అనే ఉద్దేశ్యంతో రెండు జిల్లాల నుండి విచ్చేసిన రైతు సోదరులను అభినందిస్తూ, శాస్త్రవేత్తల సలహాలు సూచనలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలన్నారు.

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ సాగు విధానాలను మార్చుకుంటూ పెట్టుబడిని తగ్గించుకుని దిగుబడులను ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని సూచించారు. విచక్షణా రహితంగా రసాయనిక ఎరువులు వాడకుండా భూసార పరిరక్షణపైన, చీడపీడల యాజమాన్యంపైన అవగాహన పెంచుకోవాలని కోరారు. కృషి విజ్ఞాన ప్రోగ్రాం డైరెక్టర్ రాజేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా వ్యవసాయ కల్పన, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు, కొమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి నదీమ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, మత్స్య శాఖ అధికారిని కుమారి భవ్యశ్రీ, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ,

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సురేఖ, మంచిర్యాల యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గౌతం, ఆసిఫాబాద్ డివిజన్ ఉద్యాన అధికారి జ్యోతి, బెల్లంపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్, ప్రతినిధులు మన అగ్రిటెక్, రాశి సీడ్స్, నూజివీడు సీడ్స్, శ్రీరామ్ బయో సీడ్ జెనెటిక్స్, సింజెంటా, ధనుకా, సిర్పూర్ పేపర్ మిల్స్, యూపిఎల్, జైన్ ఇరిగేషన్, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెటిపెట్ డిగ్రీ కళాశాల లెక్చరర్స్ విద్యార్థులు మంచిర్యాల, కొమరం భీమ్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డా. శివ కృష్ణ, శ్రీ నాగరాజు, డా.తిరుపతి, డా. స్రవంతి, డా.సతీష్, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed