విద్యుత్ శాఖకు షాక్ ఇచ్చిన ఆన్లైన్ మోసగాల్లు

by Sumithra |   ( Updated:2022-10-12 12:33:40.0  )
విద్యుత్ శాఖకు షాక్ ఇచ్చిన ఆన్లైన్ మోసగాల్లు
X

దిశ, జన్నారం : సమాజంలో ఆన్లైన్ మోసాలు రోజు రోజుకు కొత్త దారులను ఎంచుకుంటున్నాయి. ఇప్పుడు విద్యుత్ శాఖలోకి చొరబడ్డాయి. జాగ్రత్తగా ఉండకుంటే డబ్బులు గుల్ల కావడం కాయం. ఇంతవరకు ఆన్లైన్ మోసాలు ఆన్లైన్ వ్యాపార లావాదేవీలలో ఫోన్ల ద్వార జరిగే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర యూపీఐ లావాదేవిల విషయాలలో జరుగుతూ ఉండేవి. ఈ మోసాలలో డబ్బులు కోల్పోయిన ప్రజలు పోలీసులను ఆశ్రయించి కొంతమంది మాత్రమే కోల్పోయిన డబ్బులను తిరిగి పొందేవారు.

మరికొంత మంది మాత్రం పూర్తిగా నష్టపోయేవారు. ఇటువంటి ఆన్లైన్ మోసాల బారిన పడవద్దని పోలీసులు ఎన్నిసార్లు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఇంకా మోసాలు జరుగుతూనే వున్నాయి, ప్రజలు మోసపోతూనే వున్నారు. ఇప్పుడు మోసగాళ్ళు మరో కొత్త దారిని ఎంచుకున్నారు. అదే విద్యుత్ శాఖా ఒక ఇంటిలో విద్యుత్ మీటరు ఎవరి పేరుపైన వుంటుందో వారి వాట్సప్ కు ఒక సందేశం వస్తుంది. మీరు గత నెలలో చెల్లించిన కరంటు బిల్ విద్యుత్ శాఖకు అందలేదు మీరు వెంటనే బిల్లు చెల్లించాలని లేని యెడల మీ ఇంటి విద్యుత్ కనెక్షన్ ఈ తేదీలోగా తొలగించబడుతుంది, వివరాలకై ఈ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయండి అని ఆ సందేశం పంపిస్తున్నారు.

ఆ నంబరుకు కాల్ చేస్తే వారు చెప్పిన విధానంలో బిల్లులు చెల్లించాలని చెపుతున్నారు. అదే గనుక చేస్తే బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అవుతాయి. ఇలాంటి సంఘటన ఒకటి జన్నారం మండలకేంద్రంలో జరిగింది. కానీ విద్యుత్ వినియోగదారుడు కొంచం అలోచించి మోసపోకుండా జాగ్రత్త పడ్డాడు. అంతే కాక ఈ విషయాన్ని మండలకేంద్రంలోని విద్యుత్ శాఖా అధికారులకు సమాచారం అందించాడు. దీంతో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు ఆన్లైన్ మోసాలు విద్యుత్ శాఖలోకి వచ్చాయని, కొందరికి ఈ మద్య ఇటువంటి మోసపూరిత ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని, గతంలో మీరు ఏ విధంగా విద్యుత్ బిల్లులు చెల్లించారో, ఇప్పుడు కూడా అదేవిధంగా చెల్లించవచ్చని ఎవరు మోసపోవద్దని వారు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed