- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కంటి చూపు అందించడమే సంకల్పం.. ఎమ్మెల్యే వినోద్
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రి ఆవరణలో ఇవాళ ఎమ్మెల్యే కూతురు గడ్డం వర్ష ఆధ్వర్యంలో మెగా కంటి వైద్యం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో కలిసి గడ్డం వర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు ముఖ్యమన్నారు. చూపు మందగించిన వాళ్లకు ఉచితంగా అత్యంత విలువైన కంటి పరీక్షలతో చూపు ప్రసాదించడమే లక్ష్యం అన్నారు. నెన్నెల మండల ప్రజల కోసం ఈ మెగా క్యాంపు ఏర్పాటు చేశామన్నారు.
నియోజవర్గంలోని ప్రతి మండలంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారి సేవకే అంకితం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, ఏసీసీ రవికుమార్, డీఎఫ్ఓ ఆశీస్ సింగ్, నెన్నెల ఎంపీపీ గట్టు మల్లేష్, కాంగ్రెస్ నాయకులు సూరిబాబు, చిలుములు శంకర్, ఆర్డీవో హరికృష్ణ, ఎంపీటీసీ హరీష్ గౌడ్, తహశీల్దార్ జ్యోత్స్న, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, బండి ప్రభాకర్ పాల్గొన్నారు.