MLA Payal Shankar : విద్యార్థుల సమస్యలపై శ్రద్ధ వహించాలి

by Aamani |
MLA Payal Shankar : విద్యార్థుల సమస్యలపై శ్రద్ధ వహించాలి
X

దిశ, ఆదిలాబాద్ : వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వారి ఎదుర్కొంటున్న సమస్యలపై సిబ్బంది అధికారులు శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతి నగర్ కాలనీలో గల బీసీ బాలుర వసతి గృహాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువులు, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

దోమల బెడద లేకుండా, పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వార్డెన్ కు సూచించారు. కష్టపడి చదివి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి సూచించారు. అనంతరం వంటగదిని పరిశీలించి హాస్టల్ మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం సరిగ్గా లేవని , పాత బియ్యం బాగున్నాయని విద్యార్థులు ఎమ్మెల్యేకు తెలియజేశారు.ఈ సందర్భంగా హాస్టల్ నిర్వహణ తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో హాస్టల్ సంక్షేమ అధికారి ఎం శివకుమార్ , సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story