- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manda Krishna : వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలి
దిశ, జన్నారం : ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు రాష్ట్ర ఉద్యోగ నియమకాలు నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మయుద్ధ సదస్సు మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాలులో శనివారం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరై ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేసే వరకు ప్రభుత్వంపై పోరాడతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాట తప్పి మాటలతో మభ్యపెడుతున్నారని అన్నారు.
30 ఏడ్లుగా ఎన్నో ఉద్యమాలు చేసిన ఫలితంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కొండ బ్రహ్మయ్య మాదిగ, నిర్మల్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్ మాదిగ, మండల అధ్యక్షుడు కొండుకూరి ప్రభుదాస్ మాదిగ, ప్రధాన కార్యదర్శి జంగం రవి మాదిగ, ప్రచార కార్యదర్శి ముల్కాల రమేష్ మాదిగ, సీనియర్ నాయకులు మంద చిన్నయ్య మాదిగ, మామిడిపల్లి ఇందయ్య మాదిగ, దుమ్మల ఎల్లయ్య మాదిగ, దూమల్ల రమేష్ మాదిగ, మంద రాజేష్, శ్రీపల్లి అంజన్న మాదిగ, కొండుకూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.