- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారుల నిర్లక్ష్యంతో దళితులకు అన్యాయం..
దిశ, నస్పూర్ : మున్సిపల్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో దళితులకు అన్యాయం జరుగుతుందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కాదాసి రవీందర్ అన్నారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కోర్టు కేసులు నడుస్తున్న భూములలో ఇండ్ల నిర్మాణానికి మున్సిపల్ అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. అనేకసార్లు దళిత కుటుంబాలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. టీఎన్జీవోలకు, దళిత కుటుంబాలకు సయోధ్య కుదర్చడానికి ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడని ఎక్కడి మాటలు అక్కడే చెప్పుకుంటూ కాలం వెళ్ళదిస్తున్నాడని అన్నారు.
స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సయోద్యకు దళిత కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సర్వేనెంబర్ 42 లో ప్రతిరోజు రాత్రి పనులు చేస్తూ ఒక్క రోజే 12 బోర్లు వేసినా అధికారులు అటువైపు రాకపోవడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. కోర్టు కేసులో ఉన్న భూమిలో పనులు జరుగుతుంటే అధికారులు పట్టించుకోవడంలేదని దళిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై తగుచర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ రమేష్, చేన్న సాగర్, మడిపల్లి రాములు, గుడిసెల లవకుమార్, మాడుగుల మధుకర్, శ్రావణ్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.