- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం..
దిశ,బాసర: గత రెండు రోజులుగా తెలంగాణతో పాటు గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి జలాలను సంతరించుకుని ఉగ్ర రూపిణిగా ప్రవహిస్తున్నది. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు వర్షాలతో నిండి గేట్లు ఎత్తి దిగువకు వరదను సైతం వదిలారు. ఐతే శ్రీ రామ్ ప్రాజెక్టు మాత్రం వరదలతో ఒకసారి కూడా నిండలేదు. దీంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల రైతులు ఒకింత ఆవేదన చెందారు. గత మూడు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
ప్రస్తుతం 1,60,000 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంది. వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ప్రాజెక్టు గేట్లను ఏ క్షణమైనా ఎత్తి దిగువకు నీళ్లు వదిలే అవకాశం ఉన్నట్లు, పరివాహక ప్రాంతాల రైతులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే బాసర గోదావరి ఘాట్ వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భక్తులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. భక్తులు గోదావరి పుణ్య స్థానంలో ఆచరించడానికి వస్తున్న క్రమంలో వరదలను దృష్టిలో పెట్టుకొని కంచెలను ఏర్పాటు చేయాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.