Breaking News : ఎట్టకేలకు లభ్యమైన పులి జాడ

by M.Rajitha |
Breaking News : ఎట్టకేలకు లభ్యమైన పులి జాడ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కొమురం భీం ఆసిఫాబాద్(Asifabad) జిల్లాను హడలెత్తిస్తున్న పెద్ద పులి(Tiger) జాడ ఎట్టకేలకు లభ్యమైంది. జిల్లాలోని సిర్పూర్ టి మండలం ఇటిక్యాల పహాడ్ శివారులోని వాగు వద్ద పులి ఉన్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతం మహారాష్ట్రకు 2 కిమీల దూరంలో ఉండటంతో పులి కదలికలపై కన్నేసి ఉంచారు. 10 ప్రత్యేక టీమ్స్, 30 ట్రాకింగ్ కెమెరాలు, పలు డ్రోన్ కెమెరాలతో అధికారులు జాగ్రత్తగా పులిని మానిటరింగ్ చేస్తున్నారు. కాగా ఆదివారం మరోసారి దాడికి తెగబడినట్టు తెలుస్తోంది. ఇటిక్యాల పహాడ్ సమీపంలో మేకల మందపై దాడి చేసి మేకలను చంపినట్టు సమాచారం. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిపై పులి దాడి చేయగా.. వారిలో ఓ మహిళ మృతి చెందింది. మరో రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పులి దాడి నేపథ్యంలో ఇప్పటికే 15 గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. గ్రామస్తులు ఎవరూ బయటికి రావొద్దని, శివారు ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని, పశువులను మేపడానికి అటవీ ప్రాంతంలోకి వెళ్లారాదని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed