47 మంది కార్మికుల డిస్మిస్ లను రద్దు చేయాలి..

by Sumithra |
47 మంది కార్మికుల డిస్మిస్ లను రద్దు చేయాలి..
X

దిశ, బెల్లంపల్లి : భూపాలపల్లిలో అక్రమంగా డిస్మిస్ చేసిన 47 మంది కార్మికులను వెంటనే ఉద్యోగులకు తీసుకోకపోతే ఆందోళన తప్పదని సింగరేణికార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు పార్వతి రాజిరెడ్డి, చాంద్ పాషా, నీరేటి రాజన్న, దేవిసత్యం, మనిరామ్ సింగ్ మాట్లాడారు. గైర్హాజరు పేరిట సింగరేణి యాజమాన్యం కార్మికుల ఉద్యోగ భద్రతను నిర్మూలిస్తున్నదని మండిపడ్డారు. కనీసం ఫ్యామిలీ కౌన్సిలింగ్ లేకుండా సింగరేణి అధికారులు ఏకపక్షంగా సింగరేణి చరిత్రలోనే 47 మందిని డిస్మిస్ చేయడం అమానుషమని ధ్వజమెత్తారు.

సింగరేణిలో కార్మికుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి గ్యారెంటీ లేదని 47 మంది డిస్మిస్ కార్మికుల దుశ్చర్య అందుకు నిదర్శమని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా సింగరేణి యాజమాన్యం నెల రోజుల్లో 47 మందిని డిస్మిస్ చేయడం వెనక గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల మద్దతు ఉందని అభిప్రాయపడ్డారు. సింగరేణి యాజమాన్యం అక్రమ డిస్మిస్లను కార్మిక సంఘాల జేఏసీ ఖండిస్తున్నదని తెలిపారు. 47 మంది డిస్మిస్ ను రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా గనులపై నిరసన తెలుపుతామన్నారు. అప్పటికీ యజమాన్యం దిగిరాకపోతే క్రియాశీల పోరాటాలకు వెనుకాడమని హెచ్చరించారు. డిస్మిస్ చర్యలను గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకుల పాత్ర లేకపోతే ఎందుకు మౌనంగా ఉంటారని వారుప్రశ్నించారు.

సింగరేణి కార్మికులు గుర్తింపు ప్రతిని సంఘాల యాజమాన్యం అనుకూల విధానాలను అర్థం చేసుకోవాలని కోరారు. సింగరేణి యాజమాన్యం నిరంకుశ విధానాలను తిప్పుకొట్టకపోతే సింగరేణిలో కార్మికులకు ఉద్యోగాలు ఉండవని అన్నారు. ఉద్యోగ భద్రత, యజమాన్యం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోరాడితేనే ఉద్యోగ భద్రత, హక్కులు సాధించుకుంటామన్నారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బుంగ సురేందర్, మహేందర్, హరికిషన్ పాండే, బి.మల్లయ్య సదానందం, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed