ఆర్ఓఆర్ చట్టంపై చర్చ

by Sridhar Babu |
ఆర్ఓఆర్  చట్టంపై చర్చ
X

దిశ, ముధోల్ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ ముసాయిదా చట్టంపై తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ,ప్రజలు హాజరయ్యారు. ఆర్ఓఆర్ చట్టంపై పలువురు సూచనలు, సలహాలు తెలియజేశారు.

చట్టంను పకడ్బందీగా అమలు చేసి పట్టాదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఎక్కువ సంఖ్యలో పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్ఓఆర్ ముసాయిదాకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివకుమార్, రిటైర్డ్ తహసీల్దార్ వెంకటి, పీఏసీఎస్ డైరెక్టర్ లు ధర్మపురి సుదర్శన్,బీజేపీ మండల అధ్యక్షుడు కోరి పోతన్న, రైతు నాయకుడు గోపిడి ప్రేమ్ నాథ్ రెడ్డి, నాయకులు రావుల శ్రీనివాస్, కిషన్ పతంగి, రమెష్, మైసాజీ, కిషన్ పటేల్, రైతులు, స్థానికులు ,తదితరులు, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed