- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ బొమ్మ ఉందని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆపారు
దిశ, నేరడిగొండ : నేరడిగొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో బోథ్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 123 మంది లబ్ధిదారులకు రూ. 25,09,000ల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను బోథ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ మంగళవారం అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి బిడ్డ లకు ఆసుపత్రి ఖర్చులను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ ఆపలేదని, కానీ నేడు చెక్కులపై కేసీఆర్ బొమ్మ ఉందని వేల సంఖ్యలో చెక్కులను కొట్టివేసిన
ఘనత రేవంత్ రెడ్డి కే దక్కుతుందన్నారు. ఆపదలో ఉన్న పేద ప్రజల ఆసుపత్రి ఖర్చుల డబ్బులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేశారని మండిపడ్డారు. ఇలాంటి నీచపు రాజకీయాలు బీఆర్ఎస్ ఎప్పుడూ చేయలేదని,ఇకనైనా ప్రజల శక్షేమం కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, మండల కన్వీనర్లు నారాయణ రెడ్డి, కృష్ణ రెడ్డి, రాజారాం, తోట వెంకటేష్, నాగయ్య,మాజీ ఎంపీపీ, మాజీ ఎంపిటిసిలు,సర్పంచులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.