డిజిటల్ మాధ్యమాలకు బలవుతున్న బాల్యం..

by Sumithra |
డిజిటల్ మాధ్యమాలకు బలవుతున్న బాల్యం..
X

దిశ, సిరికొండ : చదువుకుంటూ, ఆడుకుంటూ హాయిగా కాలం గడపాల్సిన వయసులో చిన్నారులు టీవీలు, సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వాటిని చూస్తూ నిద్రాహారాలు కూడా మరిచిపోతున్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు డిజిటల్ మాద్యములకు బలై పోతున్నారు చిన్నారులు. గత కొన్ని సంవత్సరాలుగా చిన్నారుల్లో ఈ ధోరణి బాగా ప్రబలుతుంది. దేశంలోని చిన్నారులంతా ఎక్కువ శాతం మంది టీవీలు సెల్ ఫోన్లు ఇతర డిజిటల్ మాధ్యమాలను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

గంటల పాటు టీవీలు, ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని ఇటీవల జరిపిన అధ్యయనం తెలిపింది. కరోనా రాకముందు నుండి కంటే కరోనా వచ్చిన తర్వాత చిన్నారులు డిజిటల్ మాధ్యమాలకు బానిసలు అయినట్లు అధ్యయణం వెల్లడించింది. మారుతున్న కాలంతో పాటు ఇంటర్నెట్, ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉండడమే దీనికి కారణం అని అధ్యయనాలు చెబుతున్నాయి. డిజిటల్ మాధ్యమాలకు బానిసలవుతున్న చిన్నారులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా వాడుతూ దాని పై ఆధారపడడాన్నే స్క్రీన్ అడిక్షన్ అంటారు.

Advertisement

Next Story

Most Viewed